సంబరానికైనా...సమరానికైనా సై
Published Thu, Aug 8 2013 2:52 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం సంబరానికైనా...సమరానికైనా సమన్వయంతో పోరాటానికి సిద్ధం గా ఉన్నామని టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ తదితర సీమాంధ్ర పార్టీలు ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తూ నిరసనలు చేపడుతున్నాయని మం డిపడ్డారు. ఆయన బుధవారం టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ సాధించే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉం డాలన్నారు. పార్టీని జిల్లాలో సమన్వయం చే సేందుకే ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారని, ఎవరిపైనో పెత్తనం కోసం కాదన్నారు. అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకెళ్తామన్నారు.
కొంతమంది టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం ఎప్పుడు చేస్తారంటూ చర్చ జరుపుతున్నారని, లక్ష్యసాధనలో అనేక గాయాలయ్యాయని, ఇంకా అవిమానలేదని, అనేక త్యాగాలు, అవమానాలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నామని ఈ స్థితిలో విలీనం గురించి చర్చించడం సరైం దికాదన్నారు. ఢిల్లీలో కొందరు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన దానిపై విషప్రచారం చేస్తూ కుట్ర లు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా అమర్‌సింగ్‌లుగా మారే యత్నాలు మానుకోవాలని సూ చించారు.
పంచాయతీ ఎన్నికల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లుగానే మునిసిపల్, జడ్పీ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే సీఎం, డీజీపీలదే పూర్తి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు బొకేలతో పెద్దిని అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు కన్నెబోయిన రాజయ్యయాదవ్, నాయకులు గుడిమల్ల, ఇండ్లనాగేశ్వర్‌రావు, మర్రి యాదవరెడ్డి, కమరున్నీసా, లలితాయాదవ్, రహీమున్నీసా, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, డిన్నా, సంపత్, శ్యామ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే ఉంటా : చందూలాల్
ఢిల్లీకి వెళ్లిన తాము దిగ్విజయ్‌సింగ్‌ను కలిస్తే దానిపై విషప్రచారం చేస్తున్నారని, తాను టీఆర్‌ఎస్‌తోనే ఉంటానని మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు చందూలాల్ స్పష్టం చేశారు. దిలీప్‌ద్వారా అజిత్‌సింగ్‌ను కలిశామని అక్కడి నుంచి దిగ్విజయ్‌సింగ్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. తమ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, ఏ పార్టీలో ఉన్నా అంకితభావంతో పనిచేశామన్నారు.
Advertisement
Advertisement