వేదగణపతి మహాలడ్డు రూ. 2.51 లక్షలు
నెల్లూరు రూరల్ : నెల్లూరులోని వేదాయపాళెంలో శ్రీవేదగణపతి లడ్డు వేలంలో రూ.2.51 లక్షలు పలికింది. వినాయకచవితిని పురష్కరించుకుని వేదాయపాళెం, చంద్రమౌళీనగర్ శ్రీవేదగణపతి ఆలయం ఆవరణలో ప్రతిష్టించిన వినాయకుడి ప్రతిమ వద్ద స్వామివారి ప్రసాదంగా 500 కేజీల లడ్డును ఏర్పాటుచేశారు. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ గురువారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో వేదాయపాళెంకు చెందిన శాంతి ఎర్త్ మూవర్స్ అధినేత మద్దినేని శాంతినాయుడు రూ.2.51 లక్షలకు దక్కించుకున్నారు. ఏటా లడ్డు వేలంతో వచ్చే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మేకల రజిని, దొడ్డపనేని రాజానాయుడు, మేకల రాజేంద్ర, గొట్టిపాటి ప్రభాకర్ పాల్గొన్నారు.