కనుల పండువగా వీరభద్రస్వామి రథోత్సవం | glorious veerabhadraswamy rathotsavam | Sakshi
Sakshi News home page

కనుల పండువగా వీరభద్రస్వామి రథోత్సవం

Published Sun, Apr 2 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

కనుల పండువగా వీరభద్రస్వామి రథోత్సవం

కనుల పండువగా వీరభద్రస్వామి రథోత్సవం

ఆస్పరి :  కైరుప్పలలో ఆదివారం సాయంత్రం అశేష జనవాహని మధ్య వీరభద్రస్వామి రథోత్సవం కనుల పండవగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవిలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహలను మేళతాళాల మధ్య ఊరేగించారు. రథం ముందు వేద పండితులు రథాంగ పూజలు నిర్వహించి రథంపై ఉత్సవ విగ్రహలను ఉంచి జయజయ ధ్వానాల మధ్య భక్తులు స్వామి వారి రథాన్ని  బసవన్న దేవాలయం దగ్గరకు, అక్కడ నుంచి రథశాల వద్దకు లాగారు. రథోత్సవాన్ని చూడటానికి  వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ మల్లికార్జున, సర్పంచ్‌ శరవన్న , ఎంపీటీసీ రామలింగమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు దత్తాత్రేయరెడ్డి, ఈరన్న, లక్ష్మన్న, రామాంజినేయులు, హనుమంతు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామిని దర్శించుకున్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ అబ్దుల్‌ గౌస్, ఎస్‌ఐ వెంకటరమణ బందోబస్తు నిర్వహించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement