మంగళగిరిలో ఎయిమ్స్.. రైల్వే ఉద్యోగులకు బోనస్.. | Govt clears bonus for rail employees and AIIMS at mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో ఎయిమ్స్.. రైల్వే ఉద్యోగులకు బోనస్..

Published Wed, Oct 7 2015 4:52 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

మంగళగిరిలో ఎయిమ్స్.. రైల్వే ఉద్యోగులకు బోనస్.. - Sakshi

మంగళగిరిలో ఎయిమ్స్.. రైల్వే ఉద్యోగులకు బోనస్..

న్యూఢిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు ప్రక్రియకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏపీలోని మంగళగిరితోపాటు నాగ్ పూర్ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమబెంగాల్) లలో  ఏయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల మూడోవారం నుంచి పండుగల సీజన్ ప్రారంభం కానున్నవేళ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. 78 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలన్ని ఆ శాఖ ప్రతిపాదనలకు మోదీ సర్కార్ పచ్చజెండా ఊపింది. దీని ద్వారా రైల్వే శాఖలోని మొత్తం 12 లక్షల మంది ఉద్యోగులు లబ్దిపొందనున్నారు. బోనస్ ల చెల్లింపుల వల్ల రైల్వే శాఖపై రూ.8 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

 

అయితే 2011- 12, 2012- 13, 2013-14 కాలంలోనూ 78 రోజుల వేతనాన్ని బోనస్ గా చెల్లించిన సంగతి తెలిసిందే. ఇవేకాకుండా ఇండియా గేట్ వద్ద వార్ మెమోరియల్ ఏర్పాటు, వాటర్ షెడ్ లను ప్రోత్సహించేలా నీరాంచల్ పథకం ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement