సాంకేతిక లోపం తలెత్తటంతో వాస్కోడగామా- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు నిలిచిపోయింది.
సాంకేతిక లోపం తలెత్తటంతో వాస్కోడగామా- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు నిలిచిపోయింది. హౌరా నుంచి వాస్కోడగామా వైపు వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో లోపం తలెత్తటంతో 11.15 గంటల సమయంలో అధికారులు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద నిలిపివేశారు. ఇంజిన్‌ను శ్రీకాకుళం తీసుకెళ్లి మరమ్మతులు చేయించి తిరిగి ఉర్లాం చేర్చారు. తిరిగి రైలు 12.15 గంటలకు ప్రయాణం ప్రారంభించింది.