గుర్తింపు కార్డు తీసుకెళ్తేనే ఓటు
Published Tue, Mar 7 2017 12:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేవారు పోలింగ్ కేంద్రానికి ఫొటో ఓటరు స్లిప్పుతోపాటు గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ్స, పా¯ŒSకార్డు, సర్వీసు ఐడీ కార్డు, డిగ్రీ లేదా డిపొ్లమా ఒరిజినల్ సర్టిఫికెట్, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫి కెట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, లోకల్ బాడీలలో పనిచేసే ఉద్యోగులు సర్వీసు గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని తీసుకెళ్లవచ్చన్నారు.
Advertisement