జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్ ఎట్టకేలకు దిగివచ్చింది.
ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనం పెంపు
Published Tue, Aug 2 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ముకరంపుర: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పదేళ్లుగా కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలకు సర్కార్ ఎట్టకేలకు దిగివచ్చింది. ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న వేతనం రూ.6240నుంచి రూ.10 వేలకు పెంచింది. జిల్లావ్యాప్తంగా 936 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్మని లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement