'విజయవాడ వేదికగా రాజకీయ వ్యభిచారం' | jogi ramesh doubt on chandrababu mental condition | Sakshi
Sakshi News home page

'విజయవాడ వేదికగా రాజకీయ వ్యభిచారం'

Published Fri, Jun 3 2016 12:37 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

'విజయవాడ వేదికగా రాజకీయ వ్యభిచారం' - Sakshi

'విజయవాడ వేదికగా రాజకీయ వ్యభిచారం'

విజయవాడ: చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ నేత జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందని, ఒక గంటలో చెప్పింది మరో గంటలో మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ పై టీడీపీ నాయకులు సైకోల్లా ఆడిపోసుకుంటున్నారని అన్నారు.

మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబును ప్రశ్నిస్తే తప్పేందని ప్రశ్నించారు. బూటకపు వాగ్దానాలతో ప్రజల గుండెల్లో గునపాలు గుచ్చితే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని అన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఒక్క సంతకాన్నైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. 2 ఏళ్ల నుంచి పాడిన పాటే పడుతున్నారని, రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని అన్నారు.

విజయవాడ వేదికగా చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, సంతల్లో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఆరోపించారు. ప్రత్యేక రైల్వే జోన్, ప్రత్యేక హోదాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తలకు అమ్ముకున్నారని, బీసీలకు అన్యాయం చేశారని అన్నారు.

చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, నారా రామ్మూర్తి నాయుడు మానసిక పరిస్థితిపై కూడా అనుమానం కలుగుతోందని చెప్పాడు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాలేదని ఐదు ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలు చూపించగలమని జోగి రమేశ్ అన్నారు. వైఎస్ జగన్ పై బురద చల్లడం మానుకుని, పాలనపై దృష్టి పెట్టాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement