రాష్ట్రవ్యాప్తంగా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో ఆదివారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో ఆదివారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.