
కోర్టులోనే గుండెపోటుతో జడ్జి మృతి
విధులు నిర్వహిస్తూ.. ఓ జడ్జి కోర్టులోనే కుప్పకూలాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా భద్రాచలం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిలకా సంజీవరావు విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం విధుల్లో ఉండగానే.. జడ్జికి గుండెపోటు రావడంతో... ఒక్కసారిగా కుప్పకూలాడు.
విధులు నిర్వహిస్తూ.. ఓ జడ్జి కోర్టులోనే కుప్పకూలాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా భద్రాచలం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చిలకా సంజీవరావు విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం విధుల్లో ఉండగానే.. జడ్జికి గుండెపోటు రావడంతో... ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
సిబ్బంది హుటాహుటిన ఆయన్ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సంజీవరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలం ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం తరలించారు.