కళానికేతన్ డెరైక్టర్ లక్ష్మీ శారదకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి లీలావతి ఆదేశాలు జారీ చేశారు.
ధర్మవరం: కళానికేతన్ డెరైక్టర్ లక్ష్మీ శారదకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి లీలావతి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఆమెను ధర్మవరం నుంచి అనంతపురంలోని జిల్లా జైలుకు తరలించారు. కళానికేత న్ యాజమాన్యం తమ వద్ద పట్టుచీరలు కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదంటూ ధర్మవరానికి చెందిన కొందరు వ్యాపారులు ఏడాది క్రితం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.