అన్ని విధాలా వెనుకబడి ఉన్న బలిజలను బీసీ జాబితాలోకి చేర్చి అభివృద్ధి పరచాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి అందరూ ఏకతాటిపై వచ్చి బలిజల హక్కులు సాధించేవరకు నిరంతరం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. బీసీల్లోకి చేర్చేవరకు ఎవరూ విశ్రమించరాదని, హక్కుల్ని పొందేవరకు ప్రభుత్వంపై పోరాడాలన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు సురేష్, శ్రీనివాసులు ప్రసాద్, రమేష్, సూరి, శీన, సుబ్బయ్య, రమణ, వెంకటనారాయణ, సురేష్‌బాబు, రాముడు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.