'చంద్రబాబు దళిత వ్యతిరేకి'
గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్లకు గండి కొట్టడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామకాల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లు పాటించాలని, పోస్ట్ డాక్టరేట్ స్కాలర్‌షిప్‌లు డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా మంజూరు చేయాలని, దళితులకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రాధమిక విద్యను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని, బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని కత్తి పద్మారావు కోరారు.