'ఊర్లో తిట్లు బంద్ కావాలె' | kcr visits chinna mulkanoor as part of gramajyothi programe | Sakshi
Sakshi News home page

'ఊర్లో తిట్లు బంద్ కావాలె'

Published Mon, Aug 24 2015 7:37 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'ఊర్లో తిట్లు బంద్ కావాలె' - Sakshi

'ఊర్లో తిట్లు బంద్ కావాలె'

కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరు గ్రామంలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూములిచ్చేవారు ముందుకొస్తే నాలుగునెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అతి త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. 10 రోజుల్లో నేనే వచ్చి ఇళ్ల నిర్మాణానికి కొబ్బరికాయకొడుతా అని చెప్పారు.

ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి డాక్టర్లను తీసుకు వచ్చి హెల్త్ చెకప్ చేపిస్తామన్నారు. అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని దోమలు లేని గ్రామంగా చేసుకోవాలని సూచించారు. చిన్న ముల్కనూరు గ్రామంలో ప్రతి ఇంట్లో తిట్లు బంద్ కావాలె అని అన్నారు. ప్రతి ఇంటికి ఉపయోగ పడే చెట్లు పెంచాలన్నారు. గ్రామమంటే అందరూ సంతోషంగా బతకాలి. ఊరి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి..భూములు లేనివారికి గ్రామస్తులందరూ కలిసి పనిని కల్పించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement