ఇది కోతల ప్రభుత్వం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హన్మకొండ: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలు.. కోతల ప్రభుత్వమని, హామీలు అమలు చేయకుండా మాటలతోనే మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన హన్మకొండలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. 99.9 శాతం హామీలు అమలు చేశామని తెలంగాణ భవన్‌లో కూర్చుని కేసీఆర్ చెబితే ప్రజలకు వాస్తవం తెలియదా? అని ప్రశ్నించారు. ఆయన హామీలకు కట్టుబడి ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బహిరంగ చర్చ తర్వాతే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఓట్లు అడగాల న్నారు.
సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడవద్దని హితవు పలికారు. రుణమాఫీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వంటి పథకాల్లో కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు. పత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని, దీనికి కేంద్రం రూ.10 వేల కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై సీఎం కేసీఆర్ కుటుంబం చే స్తున్న ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. మాతృభూమిపై ప్రేమతోనే తమ పార్టీ అభ్యర్థి దేవయ్య అమెరికా పౌరసత్వం తీసుకోలేదన్నారు.