అభివృద్ధి ఆడంబరంగా కనిపిస్తోందా? | Improvement was noted to look different? | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఆడంబరంగా కనిపిస్తోందా?

Published Thu, Nov 17 2016 2:57 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

అభివృద్ధి ఆడంబరంగా కనిపిస్తోందా? - Sakshi

అభివృద్ధి ఆడంబరంగా కనిపిస్తోందా?

కిషన్‌రెడ్డిపై మండిపడిన మండలి విప్ బోడకుంటి

 సాక్షి, హైదరాబాద్: పేదల సంక్షేమమే పరమావధిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ నేతలకు ఆడంబరాలుగా, విందూ వినోద కార్యక్రమాలుగా కనిపించడం సిగ్గుచేటని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి ఏ మాత్రం అవగాహన లేని, బాధ్యతలేని వ్యాఖ్యలు చేశారని బుధవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.

నల్లధనం వెలికితీయడంలో ఏ మాత్రం ముందుచూపు లేకుండా తీసుకున్న తప్పుడు నిర్ణయంతో సామాన్యులను సంక్షోభంలోకి నెట్టినందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాల్సిందిపోరుు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని బ్యాంకులు, ఏటీఎంల వద్ద పరిస్థితి ఎలా ఉందో స్వయంగా చూసిన తర్వాత కిషన్‌రెడ్డి మాట్లాడాలని హితవు పలికారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement