నాన్ననడిగి చెబుతా..!
- తడబాటు .. తెల్లమొహం
- విద్యార్థులతో ముఖాముఖిలో లోకేశ్ ఉక్కిరి బిక్కిరి
గుంటూరు రూరల్: ప్రత్యేక హోదా, నిరుద్యోగ సమస్య, విద్యా విధానం తదితర అంశాలపై గుక్క తిప్పుకోనివ్వకుండా విద్యార్థులు సంధించిన ప్రశ్నలు, భవిష్యత్తుపై భరోసా ఏదంటూ నిలదీతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారుు. ఒక దశలో ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఆయనకు ఎంపీ గల్లా జయదేవ్ కొంత సహకరించారు. తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ప్రజాచైతన్య యాత్రలో భాగంగా లోకేశ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు 2019లో ఎన్నికలున్నారుు.. అందులో యువతదే ప్రధాన పాత్ర.. ఓట్లు వినియోగించుకోమంటూ లోకేష్ పొంతనలేని సమాధానాలిచ్చారు.
నాన్న ఖర్చులకు అమ్మే డబ్బులిస్తారు
రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అని చెబుతూ.. తన తండ్రి చంద్రబాబు ఖర్చులకు తన చిన్నతనం నుంచి తల్లి భువనేశ్వరే డబ్బులు ఇస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. ప్రస్తుతం తన భార్య బ్రహ్మణి వ్యాపారాలు చేస్తోందని, దీంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఖర్చులకు కూడా బ్రహ్మణీయే డబ్బులిస్తోందని చెప్పడంతో విద్యార్థులు ఘొల్లున నవ్వారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో లాభమా? లేక ప్యాకేజీతోనా? అని త్రివేణి అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు పొంతనలేని జవాబిచ్చారు. ‘ప్రత్యేక హోదా వల్ల ఎకై ్సజ్, ఇన్‌కంటాక్స్‌ల నుంచి మినహారుుంపు వస్తుంది. కానీ జీఎస్‌టీతో హోదాకు వచ్చే పన్ను మినహారుుంపు రారుుతీలు వస్తారుు. అదేవిధంగా పోలవరం వచ్చింది. అందుకే సీఎంప్యాకేజీని స్వాగతించారు..’అని లోకే్‌శ్ అన్నారు.
ప్రైవేటైతేనే త్వరితగతిన అభివృద్ధి
ప్రైవేటు కళాశాలల్లోనే మెజారిటీ రీసెర్చ్‌లు జరుగుతున్నాయని, ఆ రంగంలోనే త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని రాము (బీటెక్) అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా లోకేశ్ అన్నారు. ‘ఒక వైద్యురాలి నిర్లక్ష్యానికి ఒక పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వైద్యురాలిని ఎందుకు అరెస్ట్ చేయలేదు.?’అంటూ శివసారుు నిలదీయడంతో జవాబు కోసం తడుముకున్నారు. అవన్నీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి చూసుకుంటారంటూ దాటవేశారు.