వెంకయ్య ... మోదీ ఏమయ్యారు ? | M M Pallam raju takes on Modi and Venkaiah naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్య ... మోదీ ఏమయ్యారు ?

Published Tue, Aug 11 2015 12:20 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వెంకయ్య ... మోదీ ఏమయ్యారు ? - Sakshi

వెంకయ్య ... మోదీ ఏమయ్యారు ?

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజకీయం చేసే అంశం కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం.ఎం. పల్లంరాజు స్పష్టం చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ నిర్వహించిన బంద్లో ఆయన పాల్గొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... 10 ఏళ్లు కావాలన్న వెంకయ్య ఏమయ్యారని ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్న మోదీ ఏమయ్యారని పల్లంరాజు ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్లు ఇస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అయితే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని అప్పటి ప్రతిపక్షంలో  ఉన్న వెంకయ్య డిమాండ్ చేశారు. అలాగే సాధారణ ఎన్నికల సందర్భంగా సీమాంధ్రలో పర్యటించిన మోదీ ... ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement