తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండల సరిహద్దులోని పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు గల్లంతు అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు, సింహాద్రిపురం మండల కేంద్రానికి చెందిన మరో యువకుడు మొత్తం ఏడుగురు నాలుగు చక్రాల వాహనంలో ఆదివారం మధ్యాహ్నం సీబీఆర్‌లో విహార యాత్రకు వచ్చారు.
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారు తెచ్చుకున్న భోజనాలు తింటుండగా షేక్ బాబావలి (31) కొద్దిగా అన్నం తిని సీబీఆర్‌లోకి ఈతకు దిగాడు. ఇవతల గట్టునుంచి అవతల గట్టుకు ఈదుతూ వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో అతని దుస్తులకు ముళ్లకంపలు తగులుకున్నాయి. దీంతో భయబ్రాంతులకు గురైన బాబావలి రక్షించించండి అంటూ కేకలు వేశాడు. గట్టుమీద ఉన్న స్నేహితులు కిందకు దిగేలోపు అతను గల్లంతయ్యాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలసి సీబీఆర్‌లో గాలించినా జాడ కనించలేదు. గల్లంతైన బాబావలికి భార్య మెహరాబి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. లింగాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విహార యాత్రలో విషాదం
Published Sun, Jul 2 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
Advertisement
Advertisement