సంపూర్ణ అక్షరాస్యతతోనే బంగారు బతుకమ్మ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత - కొత్తకోటలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
కొత్తకోట: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తేనే తెలంగాణలో బంగారు బతుకమ్మ ఆవిష్కృతమవుతుం దని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో శనివారం రాత్రి జరి గిన బంగారు బతుకమ్మ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలతో ఎదురువచ్చి కవిత కు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా పాత్ర కీలకమైనదన్నారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.
జిల్లాను పసిడి పంటల పాలమూరుగా మారుస్తామన్నారు. వచ్చే జూన్ జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. కవిత పర్యటనను అడ్డుకునేందుకు ఆశా కార్యకర్తలు కొందరు ప్రయత్నించడంతో పోలీసులు వారి ని అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.