గిరిజనులను తరిమేయాలని కుట్ర
గిరిజనులను తరిమేయాలని కుట్ర
Published Tue, Dec 6 2016 11:37 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
ఎమ్మెల్యే రాజేశ్వరి
ఏజీ కొడేరు (చింతూరు): పోలవరం నిర్వాసితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, ఎంతోకొంత ముట్టజెప్పి ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని చూస్తున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ఆమె చింతూరు మండలం ఏజీ కొడేరు, మల్లెతోట గ్రామాల్లో గిరిజనులను మంగళవారం కలుసుకుని జగన్ పర్యటన ఉద్దేశాలను వివరించారు. నిర్వాసితుల సమస్యలను స్వయంగా తెలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్ విలీన మండలాల పర్యటనకు వస్తున్నారని, రేఖపల్లిలో గురువారం నిర్వహించే సభకు అధికసంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. వైస్ ఎంపీపీ పండా నాగరాజు, ఎంపీటీసీ సోడె బాయమ్మ, సర్పంచ్ ముచ్చిక కృష్ణకుమారి, మండల కన్వీనర్ రామలింగారెడ్డి, అంజాద్, సుధాకర్, నాగార్జున, సత్యన్నారాయణ పాల్గొన్నారు.
వన విహారిలో రాత్రి బస
మారేడుమిల్లి : ఏజెన్సీ పర్యటనకు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి బుధవారం రాత్రి వన విహారి ప్రాంగణంలో బస చేస్తారు. ఆ ఏర్పాట్లను జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదమ్‌భాస్కర్, పార్టీ మండల కన్వీనర్, జెట్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి బి.గంగరాజు, ఉపసర్పంచ్ గురుకు ధర్మరాజు మంగళవారం పరిశీలించారు. ఆయన భోజనానికి ప్రత్యేకమైన ఏజెన్సీ వంటకాలను, మారేడుమిల్లికి ప్రసిద్ధి వంటకుం బేంబూ చికెన్ రుచులను తయారు చేస్తున్నారు.
Advertisement