బెటాలియన్‌కు చేరుకున్న పోలీసులు | Police men arrived to Betalian | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌కు చేరుకున్న పోలీసులు

Aug 10 2016 9:04 PM | Updated on Aug 21 2018 5:54 PM

పుష్కరాలలో విధులు నిర్వహించేందుకు పోలీస్‌ బలగాలు బుధవారం పట్టణంలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌కు చేరుకున్నాయి.

మంగళగిరి: పుష్కరాలలో విధులు నిర్వహించేందుకు పోలీస్‌ బలగాలు బుధవారం పట్టణంలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌కు చేరుకున్నాయి. ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్రలతో పాటు పలు ఏపీఎస్పీ బెటాలియన్స్‌ నుంచి పోలీసులు చేరుకున్నారు. సుమారు మూడువేల మందికి బెటాలియన్‌లో వసతి కల్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సిబ్బంది బెటాలియన్‌లోని కల్యాణ మండపంతో పాటు ఇతర క్వార్టర్స్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా తాగునీరు, భోజన వసతులతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు బెటాలియన్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement