గెలిపిస్తేనే ఫరూక్‌కు ప్రమోషన్
– బాబు షరతు
నంద్యాల: ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తేనే మాజీ మంత్రి ఫరూక్‌కు ప్రమోషన్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు షరతు విధించారు. ఆయన నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం సంజీవనగర్, శ్రీనివాస జంక్షన్లలో పర్యటించారు. పార్టీనే నమ్ముకున్న ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని, కానీ ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తేనే ప్రమోషన్ ఇస్తామని అన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను మున్సిపల్ డైరెక్టర్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తారని చమత్కరించారు. కాగా.. చంద్రబాబుకు సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన ఓ రైతును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో పాసు పుస్తకాలను రోడ్డుపై విసిరేశారు. వెంటనే డీఎస్పీ గోపాలకృష్ణ, సిబ్బంది అతన్ని ఈడ్చుకొని వెళ్లారు.