గోపాలపట్నం (విశాఖ): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రావడానికి.. చేసిన తప్పులు, అవినీతి నుంచి బయటపడేందుకు బీజేపీ కొమ్ముకాసి ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని మండిపడ్డారు. గోపాలపట్నంలో ఆదివారం ఆయన మీడియాతో మాటాడారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో తమ ఎంపీల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురాకుండా, టీడీపీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరడం సిగ్గుచేటన్నారు.