ఆకివీడులో చోరీ
Published Mon, Nov 14 2016 2:23 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ఆకివీడు (కాళ్ల): ఇంట్లో ఎవరూలేని సమయంలో తలుపులు పగులకొట్టి చోరీకి పాల్పడిన సంఘటన ఆకివీడులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం వేకువజామున స్థానిక ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా ఉన్న వీధిలో కోశూరి అక్కయ్య ఇంటి తలుపులు పగులకొట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. వెండి వస్తువులను చోరీ చేశారు. అక్కయ్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లగా పక్కింటి వారు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆకివీడు ఎస్సై అశోక్ కుమార్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది.
చుట్టం చూపుగా వచ్చి ..
జీలుగుమిల్లి : చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తి ఇంట్లో బంగారం కాజేసిన సంఘటన మండలంలోని రామన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.›గ్రామానికి చెందిన వీర్మాల కృష్ణ బంధువు సమిశ్రగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం మూడు రోజుల క్రితం చుట్టం చూపుగా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న మంగళ సూత్రం, గొలుసు అపహరించినట్టు బాధితుడు వి.కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ ఇరపం భాస్కర్ తెలిపారు.
Advertisement
Advertisement