12 నుంచి శత చండీయాగం
12 నుంచి శత చండీయాగం
Published Wed, Aug 3 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
వల్లభాపురం(కొల్లిపర):
పుష్కరాలకు మరింత శోభను తీసుకొచ్చేందుకు వల్లభాపురం గ్రామస్తులు సన్నాహాలు ప్రారంభించారు. నీటి సంఘాల మాజీ అధ్యక్షుడు మాకిరెడ్డి శివరామిరెడ్డి నివాసంలో అర్చకులు, గ్రామ పెద్దలు మంగళవారం సమావేశమయ్యారు. బ్రహ్మర్షి, వేదమూర్తి కేవీఆర్ శాస్త్రి బృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల వివరాలను ఆయనతో పాటు పీఏసీఎస్ అధ్యక్షుడు అవుతు నగేష్‌రెడ్డి సాక్షికి తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు గ్రామంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శతచండీ యాగం, రుద్రహోమం, నవగ్రహ హోమం, సుదర్శన, మృత్యుంజయ హోమాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. 12న కృష్ణా పుష్కర ఆహ్వానం, పూజ, హారతి సంకల్పం, స్నానం ఘట్టాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రథమ కలశ స్థాపన, చండీ హోమం ప్రారంభిస్తారు. ఇదే విధంగా మిగిలిన రోజుల్లోనూ విశేష పూజలు నిర్వహించనున్నారు.
Advertisement