కరాటే వీరుడు షాహీర్
- జాతీయ స్థాయిలో బంగారు పతకం
- అంతర్జాతీయ పోటీల్లో సిల్వర్ మెడల్ కైవసం
- నేడు అభినందన సభ
పామిడి : గోవాలో ఈ నెల 12 నుంచి 15 వరకూ నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థి డీ షాహీర్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఇతను స్థానిక ఏపీ మోడల్‌స్కూల్‌లో 8వ తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశాడు. గురువారం షాహీర్‌కు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంతరాయుడు, పీఈటీ తాండ్లే నరేష్ తెలిపారు.