విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలి | should debate on educational problems | Sakshi
Sakshi News home page

విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలి

Published Sat, Oct 1 2016 1:11 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలి - Sakshi

విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఏపీటీఎఫ్‌(1938) జిల్లా విద్యా వైజ్ఞానిక సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 23 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలకు జిల్లా నుంచి విద్యారంగ నిపుణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, నూతన విద్యావిధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సీపీఎస్, తదితర అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. డాక్టర్‌ సీవీ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హదయరాజు, నాయకులు తిరుపతిరెడ్డి, శివరామిరెడ్డి, జుల్ఫీకర్‌ అలీ, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement