చెల్లి ఆత్మహత్య చేసుకుందని..అక్క కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
రంగారెడ్డి: చెల్లి ఆత్మహత్య చేసుకుందని..అక్క కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో చోటుచేసుకుంది. రావిరాల గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెలెళ్లు మంగళవారం గొడవపడ్డారు. మనస్తాపం చెందిన చెల్లెలు హెయిర్ ఆయిల్ తాగటంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది.
విషయం తెలిసిన అక్క కూడా ఫినాయిల్ తాగటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.