అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా | subpostal office opening in illanta kunat | Sakshi
Sakshi News home page

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా

Sep 24 2016 5:32 PM | Updated on Aug 9 2018 8:51 PM

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా - Sakshi

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా

అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ఎజెండా అని కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.

  • ఎంపీ వినోద్‌కుమార్‌
  • ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్‌ కార్యాలయం ప్రారంభం
  • ఇల్లంతకుంట: అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ఎజెండా అని కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు  ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ పథకాలను ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన∙సేవలందించేందుకే ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. సుకన్య యోజన పథకం ద్వారా ఆడపిల్లల పేరుమీద 14 ఏళ్లు డబ్బులు జమచేస్తే 20 సంవత్సరాలకు రెట్టింపు వస్తాయన్నారు. మెరుగైన పాలన అందించేందుకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పోస్టల్‌ సూపరిండెంట్‌ పండరి, ఎంపీపీ ఐలయ్య, జెడ్పీటీసీ సిద్దం వేణు, మార్కెట్‌  చెర్మన్‌ సరోజన, సెస్‌ డైరెక్టర్‌ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ సంజీవ్, సింగిల్‌విండో చెర్మన్లు రాఘవరెడ్డి, రవిందర్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌ పాల్గొన్నారు. 
    సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్య
     ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఆంగ్లబోధనపై ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు.  ఉపాధ్యాయులు సమయపాలన పాటించి మెరుగైన విద్యనందిస్తే ప్రైవేటు పాఠశాలలకు  విద్యార్థులు వెళ్లరని తెలిపారు. సమయపాలన పాటించి నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని సూచించారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement