జొన్నగిరి ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు?
Published Sat, Apr 1 2017 9:58 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
తుగ్గలి : జొన్నగిరి ఎస్‌ఐ మారుతీశంకర్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. వారం క్రితం చిగుర్లగుట్ట తండాకు చెందిన జయరాంనాయక్, అతని తల్లిదండ్రులపై అతని భార్య పార్వతి.. జొన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వేధింపులకు గురిచేయడంతో పాటు, ఇటీవల రాజీ అయినట్లు నమ్మించి మోసగించారని భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఎస్‌ఐ మారుతీ శంకర్ స్టేషన్‌కు పిలిపించి జయరాంనాయక్‌ను చితకబాదాడు. దీంతో మనస్తాపానికి గురైన జయరాంనాయక్ పురుగుల మందు తాగాడు. కర్నూలులో చికిత్స పొందుతున్న బాధితుడు ఎస్‌ఐ వేధింపులు భరించలేకే ఈ అఘాయిత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసు ఉన్నతాధికారులు మార్చి 31న సస్పెండ్ చేస్తూ శిక్షణలో ఉన్న ఎస్‌ఐకి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Advertisement
Advertisement