రొడ్డం(అనంతపురం): మామిడి తోటలో పని చేస్తున్న మహిళపై అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి చేసేందుకు యత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రొడ్డం మండలం బొక్సంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఓ మహిళ(35) భర్త, మరిదితో కలిసి రెండు రోజుల క్రితం(ఫిబ్రవరి-2) మామిడి తోటలో పనికి వెళ్లింది. అన్నదమ్ములిద్దరు మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన ఎల్జీబీ నగర్‌కు చెందిన గొళ్ల వెంకటేశ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయడానికి యత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడం గమనించి.. బైక్ పై పరారాయ్యాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న బాధితురాలికి అధికార పార్టీ వర్గాల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. కుల పెద్దల సహాయంతో బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పనికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం..
Published Sat, Feb 4 2017 3:48 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
Advertisement
Advertisement