పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాగా ఓబులపతితో పాటు వైఎస్ జగన్ను కలిసినవారిలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఉన్నారు.
జీవో 53 ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సక్సెస్ స్కూళ్లను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్ర జరుగుతోందని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చిస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.