హోదా తప్పక వస్తుంది : మంత్రి శిద్దా | The transport minister sidda raghava rao on special status | Sakshi
Sakshi News home page

హోదా తప్పక వస్తుంది : మంత్రి శిద్దా

Published Thu, May 5 2016 8:15 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

The transport  minister sidda raghava rao on special status

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక వస్తుందని రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు.

 

అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానితో చర్చిస్తారని చెప్పారు. రవాణా శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని ఏసీబీకి తామే ఇచ్చి దాడులు చేయిస్తామని అన్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదించిన వాటిలో తమ శాఖకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement