పిడుగు శబ్ధం
పిడుగు శబ్ధం
Published Fri, Oct 7 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఘాట్ రోడ్డులో ఓ భక్తురాలు ఆకస్మిక పిడుగు శబ్ధానికి షాక్‌తో తల్లడిల్లింది. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకరణలో వెలసిన అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒకసారిగా మేఘాలు కమ్ముకుని చినుకులతో వర్షం మొదలైంది. ఇంతలో పెద్దశబ్ధంతో సీతమ్మ వారి పాదాల వద్ద సబ్‌స్టేçÙన్‌పై పిడుగు పడింది. ఆ భీకర శబ్దానికి క్యూలైన్‌లో ఉన్న ఓ యువతి షాక్‌కు గురై కింద పడిపోయింది. పొంగలి షెడ్డు వద్ద ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ప్రేమ్ వెంటనే తేరుకుని తన రెండు చేతులపై ఆ యువతిని ఎత్తుకుని పరుగు పరుగున ఆలయ ప్రాంగణంలోని వైద్య శిబిరానికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఆమె ఇంకా ఆందోళనలో ఉండటంతో దేవస్థాన ఆంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతికి సకాలంలో ప్రథమ చికిత్స అందేలా చేసిన సెక్యూరిటీ గార్డు ప్రేమ్‌ను అందరూ అభినందించారు.
Advertisement