వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జామ్
Published Tue, Aug 23 2016 2:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
యాదగిరిగుట్ట : ఎన్హెచ్9 పై మంగళవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. జిల్లాల, మండలాల పునర్విభజన భాగంగా ప్రభుత్వం సోమవారం జిల్లాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం మూటకొండూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. మూటకొండూరు మండలంలో చిన్న కందకూరు గ్రామాన్ని కలపవద్దంటూ చిన్నకందకూరు గ్రామస్తులు వరంగల్-హైదరాబాద్ జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారితో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పుష్కరాలకు వెళ్లే వాహనాలకు దీని వల్ల ఇబ్బంది తలెత్తింది.
Advertisement
Advertisement