వాళ్లు మావోయిస్టులు కాదు... వేటగాళ్లు! | Two killed in encounter in vishakapatnam district | Sakshi
Sakshi News home page

వాళ్లు మావోయిస్టులు కాదు... వేటగాళ్లు!

Published Tue, Feb 23 2016 2:55 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

Two killed in encounter in vishakapatnam district

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన వారు మావోయిస్టులు కాదని... వారు కేవలం వేటగాళ్లు మాత్రమే అని సమాచారం. ఒడిశా రాష్ట్రం కోరుకొండ బ్లాక్ తుంటా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అడవిలో గేదెలను పట్టుకోవడానికి వచ్చిన సమయంలో వారి చేతుల్లో నాటు తుపాకులు ఉండటంతో మావోలుగా పొరబడి పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో పొడియం గంగాళ్, మడసం గంగాలు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇరుమాళ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement