తూప్రాన్ : కలెక్టర్ దత్తత గ్రామమైన తూప్రాన్ మండలం మల్కాపూర్‌ను యూనిసెఫ్ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. వీరిలో ఢిల్లీకి చెందిన ఫ్రాంక్ బధియాంబో వాష్ స్పెషలిస్ట్, లండన్‌కు చెందిన జెమ్స్‌కారీ, హైదరాబాద్‌కు చెందిన వాష్‌స్పెషలిస్టు సెలాధియత ఆర్ నల్టీ, మధుసూదన్‌రెడ్డి, కేశవరెడ్డి ఉన్నారు. వారికి స్థానికులు పూల దండలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమష్టిగా చేపట్టిన వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, మిషన్ భగీరథ, మొక్కల పెంపకం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారు గ్రామస్తుల తీరును అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఇతర గ్రామస్తులు ఐక్యంగా ఏర్పడితే ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఈఓపీఆర్‌డీ రాఘవరావు, సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.