నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రేమ్ కాజల్
-
వేటపాలెంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
-
వ్యభిచారిణులు, నిర్వాహకులు, బ్రోకర్ల అరెస్టు
-
నిందితుల్లో ఒకరు పాలమూరు వాసి
చీరాల రూరల్: వేటపాలెంలో సెక్స్ రాకెట్ గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేశారు. మహిళల పేదరికాన్ని ఆసరా చేసుకుని వారికి డబ్బులు ఎరగావేసి వ్యభిచార కూపంలోకి దింపే ముఠాను కటకటాల వెనక్కి నెట్టారు. వేటపాలెం, హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిర్వాహకులతో పాటు ముగ్గురు బ్రోకర్లు, వ్యభిచారానికి పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. చీరాల కొత్తపేటలోని టూటౌన్ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ డాక్టర్ ఎం.ప్రేమ్‌కాజల్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు Ðð ల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలెం రావూరిపేటలోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పక్క వ్యూహం ప్రకారం పోలీసులు ఆ కేంద్రంపై దాడి చేసి దేశాయిపేటకు చెందిన కట్టా తిరుపతమ్మ, చీరాల మండలం వాడరేవుకు చెందిన చౌడిపిల్లి సుజాత, హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో నివాముంటున్న కంచెం మాధవరెడ్డి, బంజారాహిల్స్‌కు చెందిన చింతల లక్ష్మీనారాయణ, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం బురుగుంటకు చెందిన కారు డ్రైవర్ బేగారి శ్రీనివాస్, బ్రోకర్లు వేటపాలెం మండలం నాయనిపల్లెకి చెందిన గుత్తి సాంబశివరావు, అదే మండలం దేశాయిపేటకు చెందిన గుత్తి సాంబశివరావు (ఇద్దరిదీ ఒకే పేరు), తెలగతోటి అశోక్‌తో పాటు వ్యభిచారానికి పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 20 సెల్‌ఫోన్‌లు, రూ.4 వేల నగదు, ఒక బొలేరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాభిచారిణులను ఒంగోలు రిస్క్వూ హోమ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు.
ఇక్కడి నుంచి అక్కడికి..
వేటపాలేనికి చెందిన కట్టా తిరుపతమ్మ, వాడరేవుకు చెందిన చౌడిపిల్లి సుజాతలు స్థానికంగా నివాసముంటూ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తుంటారు. మహిళల అవసరాలను ఆసరా చేసుకుని వారిని చేరదీసి వ్యభిచార రొంపిలోకి దించుతారు. వీరిద్దరికి హైదరాబాద్‌కు చెందిన వ్యాభిచార కేంద్రం నిర్వాహకులు మాధవరెడ్డి, లక్ష్మీనారాయణతో సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వ్యభిచారం చేసేందుకు వేటపాలెం నుంచి మహిళలను తరలిస్తుంటారు. మహిళలను తరలించేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బేగారి శ్రీనివాస్‌ను వాహన డ్రైవర్‌గా ఉపయోగిస్తారు. మహిళలను వ్యభిచార గృహానికి తీసుకొచ్చేందుకు వేటపాలే నికి చెందిన గుత్తి సాంబశివరావు, తెలగతోటి అశోక్, గుత్తి సాంబశివరావులను వినియోగిస్తుంటారు.