ఈ నెల 30న వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవం | Veternery university Convocation to be held on May 30 | Sakshi
Sakshi News home page

ఈ నెల 30న వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Published Thu, May 26 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది.

యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరై విద్యార్థులకు డిగ్రీలను అందచేస్తారు. తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.బలరామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేస్తారు.

ఈ స్నాతకోత్సవం సందర్బంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు వేయి మందికి డిగ్రీలను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం మహతి ఆడిటోరియంలో ఈ నెల 30 ఉదయం 10 గంటలకు జరుగుతుందని యూనివర్సిటీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement