ప్రేమ విఫలమై ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
మిర్యాలగూడ అర్బన్ (నల్గొండ జిల్లా): ప్రేమ విఫలమై ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ మండలం బాపూజీనగర్‌కు చెందిన కామపల్లి శ్రీనివాస్(23), అదే ప్రాంతంలో నివాసముంటోన్న ఓ మైనర్ బాలిక(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ 25 రోజుల క్రితం ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పారిపోయిన ఇద్దరూ ప్రకాశం జిల్లాలో ఉన్నారని తెలుసుకుని వీరిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా తనను పెళ్లి చేసుకున్నాడని 10 రోజుల క్రితం మైనర్ బాలిక చేత తల్లిదండ్రులు కేసు పెట్టించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ బుధవారం మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీనివాస్‌ను హుటాహుటిన మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.