కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన | YS Jagan mohan reddy visit Flood Affected Hit Area railway koduru mandal | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన

Published Mon, Nov 23 2015 11:38 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన - Sakshi

కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన

పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శిస్తున్నారు.

రైల్వేకోడూరు : పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఆయన సోమవారం ఉదయం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డిలో రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చూస్తాన్నారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు.

కాగా వైఎస్ జగన్ శెట్టిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో ఇటీవల గోడకూలి మృతి చెందిన బాలుడు హర్షవర్దన్(4) తల్లిదండ్రులు తిరుమల, కృష్ణవేణి దంపతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ఎస్.కొత్తపల్లి గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధిత రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటారు.


వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, వరద బాధిత ప్రాంతాలు, పరామర్శ, కుక్కలదొడ్డి, YS Jagan mohan reddy, flood effected areas, kukkala doddi
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement