తిరుపతి స్కావెంజర్స్ కాలనీలోని డంపింగ్ యార్డు ఎత్తి వేయాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ ఆందోళన చేపట్టింది.
తిరుపతి: తిరుపతి స్కావెంజర్స్ కాలనీలోని డంపింగ్ యార్డు ఎత్తి వేయాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. శనివారం సాయంత్రం డంపింగ్ యార్డు వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చెత్తచెదారం కారణంగా కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే దానిని మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. ఆందోళన కొనసాగుతోంది.