టెట్, డీఎస్సీలకు అర్థమెటిక్ పాఠాలు | Arithematic lessons for TET and | Sakshi
Sakshi News home page

టెట్, డీఎస్సీలకు అర్థమెటిక్ పాఠాలు

Published Thu, Aug 29 2013 4:53 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

Arithematic lessons for TET and

 

 

 

1.    మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి?
     1) 5.6       2) 5.5      
     3) 6.5       4) 4.6
 
 2.    ఒక ఉద్యోగి మొదటి 5 నెలల సరాసరి ఖర్చు రూ.120, తర్వాత 7 నెలల సరాసరి ఖర్చు రూ.130 అయితే ఆ సంవత్సరంలో అతడు మొత్తం మీద రూ. 290 సేవింగ్‌‌స చేస్తే  సరాసరి నెల ఖర్చు?
     1) రూ. 160    2) రూ. 170
     3) రూ. 150    4) రూ. 140
 
 3.    ఒక తరగతిలోని 40 మంది విద్యార్థుల్లో  30 మంది విద్యార్థుల సరాసరి ఎత్తు 160 సెం.మీ. మిగిలిన వారి సరాసరి ఎత్తు 156 సెం.మీ. అయితే మొత్తం తరగతిలోని విద్యార్థుల సరాసరి ఎత్తు?
     1) 159 సెం.మీ    2) 160 సెం.మీ    
     3) 159.5 సెం.మీ    4) 160.5 సెం.మీ    
 
 4.    12 అంశాల సరాసరి 15. అందులో మొదటి 2 అంశాల సరాసరి 14 అయితే మిగిలిన అంశాల సరాసరి?
     1) 16          2) 15    
     3) 15.2    4) 13.2
 
 5.    13 సంఖ్యల సరాసరి 30. వాటిలో మొదటి 7 సంఖ్యల సరాసరి 32, చివరి 7 సంఖ్యల సరాసరి 28 అయితే 7వ సంఖ్య?
     1) 10        2) 20       
     3) 30      4) 40
 
 6.    ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల  సగటు వయసు 9 ఏళ్లు. ఉపాధ్యాయుడి వయసుని కూడా కలిపితే వారి సగటు వయసు 10 ఏళ్లు. అయితే  ఉపాధ్యాయుడి వయసు (సంవత్సరాల్లో)?
     1) 10           2) 20    
     3) 30        4) 40
 
 7.     డిస్కౌంట్‌ను  దేనిపై లెక్కిస్తారు..?
     1) కొన్నవెల      2) అమ్మిన వెల
     3) ప్రకటన వెల    4) ఏదీకాదు
 
 8.    ఒక వస్తువు అమ్మిన వెల రూ. 35. డిస్కౌంట్ రూ. 5 అయితే డిస్కౌంట్ శాతం?
 
     1)       2)      3) 30%     4) 5%
 
 9.    ఒక సైకిలు ప్రకటన వెల రూ. 1280.
 
 10 శాతం డిస్కౌంట్‌తో దాన్ని అమ్మితే, రూ. 72 లాభం వస్తుంది. అయితే కొన్నవెల?
     1) రూ. 1152    2) రూ. 1408
     3) రూ. 1080    4) రూ. 1352
 
 10.    ఒక రేడియో పట్టి వెల రూ. 1200. 20శాతం రిబేటు ఇచ్చి అమ్మినప్పుడు దానిపై 4 శాతం నష్టం వస్తే... పట్టీవెలకు కొన్నవెల ఎంత శాతం తక్కువ?
     1) 20%    2) 10%
     3) 5%        4) ఏదీ కాదు
 
 11.    ఒక వ్యాపారి రూ.1800 ఖరీదు ఉన్న పట్టు   చీరపై 20% రిబేటును ప్రకటించాడు. కొనుగోలుదారుడు తాను చెల్లించాల్సిన ధరపై 10% రిబేటు ఇవ్వడానికి వ్యాపారి అంగీకరించాడు. మొత్తం మీద ప్రకటిత వెలపై రిబేటు శాతం?
     1) 15%      2) 25%
     3) 30%    4) 28%
 
 12.    వరుస డిస్కౌంట్లు 10శాతం, 20శాతం, 40శాతాలకు సమానమైన డిస్కౌంట్?    
     1) 50%  2) 56.8%  3) 60%  4) 70.28%
 
 13.    ఒక వస్తువు ప్రకటన వెలపై రాజు 25% డిస్కౌంట్ పొందాడు. అతడు ఆ వస్తువును రూ. 660కు అమ్మితే 10% లాభం వస్తే ప్రక టన వెల ఎంత?
     1) రూ. 600    2) రూ. 700   
     3) రూ. 800         4) రూ. 685
 
 14.    వర్తకుడు ఒక వస్తువుపై 5% డిస్కౌంట్‌ను ప్రకటించాడు. ఒకవేళ అతడు ఆ వస్తువుపై 7% డిస్కౌంట్ ఇస్తే తాను సంపాదించే లాభంలో రూ. 15 తక్కువ వస్తుంది. అయి తే ఆ వస్తువు ప్రకటన వెల?(రూపాయల్లో)
     1) 500       2) 650    
     3) 750     4) 900
 
 15.    గోపాల్, భూపాల్‌లు వరుసగా రూ. 4,000,రూ.6,000 పెట్టుబడులతో వ్యాపారం చేశారు. ఏడాది చివరలో వచ్చిన లాభం
 రూ. 1500 అయితే వారి లాభాల తేడా?     
     1) రూ. 300     2) రూ. 650
     3) రూ. 750     4) రూ. 900
 
 16.    సమాన పెట్టుబడులతో A, B వ్యాపారం ప్రారంభించారు. కానీ 8 నెలల తర్వాత ఆ వ్యాపారం  నుంచి విరమించుకున్నాడు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం రూ. 1000 అయితే అందులో ఆ లాభం?
     1) రూ. 400     2) రూ. 600  
     3) రూ. 800      4) రూ. 1000
 
 17.    డేవిడ్, గోపి పెట్టుబడుల మొత్తం రూ. 8000. సంవత్సరాంతంలో వచ్చిన మొత్తం లాభం రూ. 1000. పెట్టుబడుల నిష్పత్తిలో కాకుండా సమానంగా పంచుకుంటే డేవిడ్‌కు రూ. 50 నష్టం వస్తుంది. అయితే గోపి పెట్టుబడి? (రూపాయల్లో)
     1) రూ. 3,600     2) రూ. 4,400
     3) రూ. 4,000     4) రూ. 4,500
 
 18.    A  రూ. 8,000,  B రూ. 10,000 పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభిం చారు. 4 నెలల తర్వాత C రూ. 12,000తో  వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతంలో వచ్చిన లాభంలో ఏ ఇద్దరి లాభాలు సమానం?
     1) A, B       2) B, C  
     3) C, A      4) A,B,C
 
 19.    రమేశ్ వర్తకం ప్రారంభించి కొంత కాలానికి మహేశ్‌ను భాగస్వామిగా చేర్చుకున్నాడు. వారి పెట్టుబడుల నిష్పత్తి 3:4.  సంవత్స రాంతంలో వారి లాభాల వాటాలు సమా నంగా ఉంటే మహేశ్ ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు?
     1) 9        2) 3      3) 6      4) 2
 
 20.    A, B, C లు ఒక వ్యాపారంలో 5:6:8 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు. సంవ త్సరాంతంలో వారు 5:3:12 నిష్పత్తిలో లాభాలు పంచుకున్నారు. అయితే వారు పెట్టుబడులను ఉంచిన కాలాల నిష్పత్తి?
     1) 1 : 2 : 3    2) 2 : 1 : 3    
     3) 3 : 2 : 1     4) ఏదీకాదు
 
 21.    రెండు పంపులు ఒక నీటితొట్టిని వరుసగా 10 నిమిషాలు, 15 నిమిషాల్లో నింపు తాయి. రెండు పంపులను ఒకేసారి తెరిస్తే ఆ తొట్టి ఎంత కాలంలో నిండుతుంది?
     1) 90 నిమిషాలు     2) 105 నిమిషాలు
     3) 12 నిమిషాలు     4) 6 నిమిషాలు
 
 22.    కుళాయి ఒక తొట్టెను 25 నిమిషాల్లో నింపుతుంది. వేరే కుళాయి దాన్ని 50 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. రెండు కుళా యిలను ఒకేసారి వదిలితే ఆ తొట్టి ఎన్ని నిమిషాల్లో నిండుతుంది?
     1) 25 నిమిషాలు     2) 50 నిమిషాలు
     3) 15 నిమిషాలు     4) 10 నిమిషాలు
 23.    A, B ఒక పనిని 12 రోజుల్లో; B, C 15 రోజుల్లో; A, C 20 రోజుల్లో పూర్తి చేస్తారు. A, B, C కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
     1) 10 రోజులు     2) 15 రోజులు
     3) 20 రోజులు    4) 25 రోజులు  
 
 24.    ఒక పనిని P, Q లు వరుసగా 6, 5 రోజుల్లో  చేస్తారు. వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేసి రూ. 330 సంపాదించారు. అయితే సొమ్ములో P వాటా?
     1) రూ. 180      2) రూ. 150  
     3) రూ. 120    4) రూ. 90
 
 25.    12 మంది పురుషులు, 8మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో, 13మంది పురుషులు, 4గురు స్త్రీలు అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. అదేపనిని ముగ్గురు  పురుషులు, 12 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
     1) 25 రోజులు     2) 24 రోజులు
     3) 20 రోజులు    4) 16 రోజులు
 
 26.    A, B లు ఒక పనిని 30 రోజుల్లో చేయ గలరు. వారిద్దరు 20 రోజులు పని చేసిన తర్వాత B పని నుంచి విరమించు కున్నాడు.  B మిగిలిన పనిని చేయడానికి Aకు 20 రోజులు ఎక్కువ సమయం పట్టింది. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో  చేయగలడు?
     1) 10 రోజులు    2) 20 రోజులు
     3) 40 రోజులు     4) 60 రోజులు
 
 27.    210 మీటర్లు, 240 మీటర్ల పొడవులు ఉన్న రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. మొదటి రైలు వేగం 90 కి.మీ./గంట, రెండో రైలు మొదటి రైలును 36 సెకన్లలో దాటింది. ఒకవేళ రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఒకదానిని మరొకటి దాటడానికి పట్టే కాలం?
     1) 4 సె.   2) 6 సె.  3) 6 సె.  4) 12 సె.
 
 28.    90 మీటర్ల పొడవు ఉన్న రైలు వేగం 22.5 కి.మీ./గంట. ఆ రైలు 4.5 కి.మీ./గం. వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న వ్యక్తిని దాటేందుకు పట్టే కాలం?
     1) 12 సె.  2) 8 సె.  3) 4 సె.  4) 2 సె.
 
 29.    ఒక రైలు హైదరాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయవాడకు ఉదయం 10 గంటలకు చేరింది. మరో  రైలు విజయవాడలో ఉదయం 8 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 11.30 గంటలకు చేరింది. అయితే ఆ రెండు రైళ్లు ఏ సమయంలో కలుసుకుంటాయి?
     1) 8.56 am      2) 9 am
     3) 9.26 am     4) 8.45 am
 
 30.    100 మీటర్ల పరుగు పందెంలో 5 మీటర్ల తేడాతో ఆను A; 10 మీటర్ల తేడాతో Cను  B ఓడించాడు. అయితే ఎన్ని మీటర్ల తేడాతో Cను A ఓడించాడు?
     1) 12బీ మీ    2) 12బీ మీ
     3) 14బీ మీ    4) 15బీ మీ
 
 31.    మీటరు/సెకనుల్లో 54 కి.మీ/గం. విలువ?
     1) 10 మీ/సె     2) 15 మీ/సె
     3) 20 మీ/సె     4) 25 మీ/సె
 
 32.    ఒక వ్యక్తి గంటకు 3 కి.మీ. వేగంతో ఒక చతురస్ర కర్ణాన్ని 2 నిమిషాల్లో  దాటాడు? అయితే ఆ చతురస్ర వైశాల్యం?
     1) 2,500 చ.మీ.    2) 5,000 చ.మీ.
     3) 7,500 చ.మీ.    4) 10,000 చ.మీ.
 
 33.    ఒక రబ్బరు బంతి కొంత ఎత్తు నుంచి నేలపై పడిన తర్వాత మొదటి ఎత్తులో 90శాతం మాత్రమే మళ్లీ ఎగురుతుంది. దాన్ని 100 మీటర్ల ఎత్తుగల భవనం పైనుంచి జారవిడిస్తే రెండు సార్లు భూమిని తాకిన తర్వాత ఆ బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుంది?
     1) 100 మీ     2) 200 మీ
     3) 81 మీ     4) 49 మీ
 
 34.    4 శాతం వడ్డీరేటు చొప్పున కొంత సొమ్ము పై 2 ఏళ్లలో లభించే చక్రవడ్డీ, బారువడ్డీల తేడా రూ. 4 అయితే ఆ సొమ్ము?
     1) రూ. 2,000    2) రూ. 2,500
     3) రూ. 3,000    4) రూ. 3,500
 
 35.    ఒక గ్రామ జనాభా 625. ఏటా 8 శాతం చొప్పున జనాభా పెరిగితే... రెండేళ్ల తర్వాత ఆ గ్రామ జనాభా?
     1) 459       2) 729   
     3) 847    4) 926
 
 36.    ఒక వ్యక్తి A నుంచి Bకు 3 కి.మీ/గం వేగంతో తిరిగి B నుంచి Aకు 6 కి.మీ/ గం. వేగంతో నడిస్తే అతడి సగటు వేగం?
     1) 3బీ కి.మీ/గం.    2) 4 కి.మీ./గం.
     3) 5 కి.మీ/గం.    4) 6 కి.మీ/గం.
 
 37.    ఒక విద్యార్థి 12 ప్రశ్నలను సాధించి.. వాటికి పూర్తి మార్కులు పొందాడు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉండి, అతడికి 60శాతం మార్కులు వస్తే, ఆ పరీక్షలోని మొత్తం ప్రశ్నల సంఖ్య?
     1) 10    2) 15     3) 20     4) 25
 
 38.    రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. మొదటి సంఖ్యకు 2, రెండో సంఖ్యకు 5 కలిపితే ఈ నిష్పత్తి 4 :7 అయితే ఆ సంఖ్యలు?
     1) 12, 21     2) 18, 30
     3) 20, 35    4) 4, 7
 
 39.     రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3, వాటి వర్గాల మధ్య భేదం 144. అయితే ఆ రెండు సంఖ్యలు?
     1) 15, 9     2) -15, -9
     3) 1, 2    4) ఏదీకాదు
 
 40.    A ఒక పనిని 12 రోజుల్లో  పూర్తి చేస్తాడు. Aకంటే ఆకి 50 శాతం సామర్థ్యం ఎక్కువ. అయితే ఆ పనిని ఆ ఎన్ని రోజుల్లో  పూర్తి  చేస్తాడు?
     1) 6 రోజులు    2) 8 రోజులు
     3) 10 రోజులు    4) 3 రోజులు
 
 41.    A అనే వడ్రంగి 6 గంటల్లో ఒక కుర్చీ తయారు చేస్తాడు. అదే కుర్చీని తయారు చేయడానికి ఆకి 7 గంటలు పడితే.. ఒక్కో వడ్రంగి రోజుకు 8 గంటలు వంతున పని చేస్తే 21 రోజుల్లో ఎన్ని కుర్చీలు తయారు చేస్తారు?
     1) 28            2) 24       
     3) 52         4) 34
 
 42.    ఒక ఉద్యోగి 3 కి.మీ./గం. వేగంతో నడిస్తే ఆఫీస్‌కు 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. 5 కి.మీ./గం. వేగంతో నడిస్తే ఆఫీస్‌కు 20 నిమిషాలు ముందుగా వెళ్తాడు. అయితే అతడి ఇంటికి, ఆఫీస్‌కు మధ్య దూరం?
     1) 4 కి.మీ    2) 5 కి.మీ
     3) 6 కి.మీ    4) 7 కి.మీ
 
 సమాధానాలు
 1) 1    2) 3    3) 1    4) 3    5) 3
 6) 4    7) 3    8) 2    9) 3    10) 1
 11) 4    12) 2    13) 3    14) 3    15) 1
 16) 4    17) 1    18) 3    19) 2    20) 2
 21) 4    22)2    23) 1    24) 2    25) 3
 26) 4    27) 4    28) 1    29) 1    30) 3    
 31) 2    32) 2    33) 3    34) 2    35) 2    
 36) 2    37) 3    38) 2    39) 3    40) 2
 41) 3    42) 2
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement