ప్రవాసీ భారతీయ దివస్ | Non-resident Indian Divas | Sakshi
Sakshi News home page

ప్రవాసీ భారతీయ దివస్

Published Thu, Sep 4 2014 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

ప్రవాసీ భారతీయ దివస్

ప్రవాసీ భారతీయ దివస్

1915, జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ఏటా జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్‌గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు.. భారతదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటారు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) వంటివి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
 
 ఎల్‌ఎం సింఘ్వీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రవాస భారతీయులపై అధ్యయనం జరిపి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏటా జనవరి 9ను ప్రవాసీ భారతీయ దివస్‌గా జరపాలని నిర్ణయించారు. దివస్ సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వ్యక్తులను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులతో సత్కరిస్తారు.
 
 తొలి ప్రవాసీ భారతీయ దివస్:
 మొదటి ప్రవాసీ భారతీయ దివస్‌ను 2003, జనవరి 9న న్యూఢిల్లీలో నిర్వహించారు. 12వ ప్రవాసీ భారతీయ దివస్ 2014, జనవరి 7-9 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. సదస్సుకు 51 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా మలేషియా సహజ వనరులు, పర్యావరణ మంత్రి దాతుక్‌సెరీ జి.పళనివేల్ హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరి వివరాలు..
 
 1.    ఇలా గాంధీ (మహాత్మా గాంధీ ముని మనుమరాలు, దక్షిణాఫ్రికా)
 2.    లీసా మారియా సింగ్ (ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనేటర్)
 3.    కురియన్ వర్గీస్ (బహ్రెయిన్)
 4.    రేణు ఖతోర్ (అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్)
 5.    వాసుదేవ్ చంచ్‌లానీ (కెనడా)
 6.    బికాస్ చంద్ర సన్యాల్ (ఫ్రాన్స్)
 7.    సత్నారాయన్‌సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్ (నెదర్లాండ్స్)
 8.    శిశీంద్రన్ ముత్తువేల్ (పపువా న్యూగినియా)
 9.    శిహాబుద్దీన్ వావాకుంజు (సౌదీ అరేబియా)
 10.    షంషీర్ వాయలిల్ పరంబత్ (యూఏఈ)
 11.    శైలేష్ లక్మన్ వర (బ్రిటన్)
 12.    పార్థసారథి చిరామెల్ పిళ్లై (యూఎస్‌ఏ)
 13.    రామకృష్ణ మిషన్ (ఫిజీ)
 2015 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్‌ను గుజరాత్‌లో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహిస్తారు. గాంధీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు అయిన సందర్భంగా గుజరాత్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
 ప్రవాసీ భారతీయ దివస్- వివరాలు
 సదస్సు    సంవత్సరం    నగరం
 1    2003    న్యూఢిల్లీ
 2    2004    న్యూఢిల్లీ
 3    2005    ముంబై
 4    2006    హైదరాబాద్
 5    2007    న్యూఢిల్లీ
 6    2008    న్యూఢిల్లీ
 7    2009    చెన్నై
 8    2010    న్యూఢిల్లీ
 9    2011    న్యూఢిల్లీ
 10    2012    జైపూర్
 11    2013    కోచి
 12    2014    న్యూఢిల్లీ
 13    2015    గాంధీనగర్
 
 ఇంటర్‌పోల్ ప్రచారకర్త ఎవరు?
 ప్రాక్టీస్ బిట్స్
 
 1.    చెన్నమనేని విద్యాసాగర్‌రావును ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించారు?
     ఎ) రాజస్థాన్     బి) గుజరాత్
     సి) మిజోరం     డి) మహారాష్ట్ర
 
 2.    2015 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
     ఎ) రాజస్థాన్     బి) గుజరాత్
     సి) పశ్చిమబెంగాల్     డి) కేరళ
 
 3.    ఇంటర్‌పోల్ చేపట్టిన ‘టర్న్ బ్యాక్ క్రైమ్’ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎంపికైన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు?
     ఎ) అమీర్‌ఖాన్    బి) అమితాబ్ బచ్చన్
     సి) షారుక్‌ఖాన్    డి) అక్షయ్ కుమార్
 
 4.    2014, సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని పెన్షన్ పథకం కింద పెన్షనర్లకు చెల్లించే నెలసరి కనీస పెన్షన్ ఎంత?
     ఎ) రూ.500     బి) రూ.1000
     సి) రూ.750     డి) రూ.1500
 
 5.    {పపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ)గా ఎవరి పదవీ కాలాన్ని అక్టోబర్ 31 వరకు పొడిగించారు?
     ఎ) ఎమ్‌ఎన్ ప్రసాద్     బి) కౌశిక్ బసు
     సి) జగదీశ్ భగవతి     డి) రాకేశ్ మోహన్
 
 6.    అవామీ లీగ్ పార్టీ ఏ దేశంలో అధికారంలో ఉంది?
     ఎ) పాకిస్థాన్     బి) బంగ్లాదేశ్
     సి) సిరియా         డి) నేపాల్
 
 7.    సర్ సి.వి.రామన్‌కు భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది?
     ఎ) 1928     బి) 1954
     సి) 1930     డి) 1934
 
 8.    {పస్తుతం యూరో కరెన్సీని వినియోగిస్తున్న దేశాల సంఖ్య?
     ఎ) 18     బి) 19     సి) 28     డి) 29
 
 9.    2,800 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అణు విద్యుత్ కేంద్రాన్ని ఫతేబాద్ జిల్లాలోని గోరఖ్‌పూర్‌లో నిర్మించనున్నారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) పశ్చిమ బెంగాల్     బి) ఉత్తరప్రదేశ్
     సి) రాజస్థాన్     డి) హర్యానా
 
 10.    పృథ్వీ-2 క్షిపణి ఎంతదూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు?
     ఎ) 700 కి.మీ.     బి) 500 కి.మీ.
     సి) 350 కి.మీ.     డి) 650 కి.మీ.
 
 11.    ‘2016 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పూరిస్థాయిలో సేవలు లభించే ఎలక్ట్రానిక్ బ్యాంకు ఖాతా ఉండాలి’ అని సూచించిన కమిటీకి నేతృత్వం వహించిందెవరు?
     ఎ) నచికేత్ మోర్     బి) ఆనంద్ సిన్హా
     సి) సి.రంగరాజన్     డి) కేసీ చక్రవర్తి
 
 12.    2014 జనవరిలో భారత నౌకాదళంలో చేరిన విమాన వాహక నౌక పేరు?
     ఎ) ఐఎన్‌ఎస్ ఢిల్లీ
     బి) ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య
     సి) ఐఎన్‌ఎస్ దీపక్    డి) ఐఎన్‌ఎస్ సింధురత్న
 
 13.    2014, జనవరి 11న మరణించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎవరు?
     ఎ) ఎహుద్ బరాక్     బి) ఇజాక్ షమీర్
     సి) ఏరియల్ షెరాన్     డి) మోషె నిసిమ్
 
 14.    బ్లాక్ పాంథర్ అని అభిమానులు పిలుచుకునే యుసేబియో ఇటీవల మరణించారు. ఆయన 1966 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఏ దేశం తరఫున ఆడి తొమ్మిది గోల్స్ సాధించాడు?
     ఎ) బ్రెజిల్         బి) ఉరుగ్వే
     సి) ఇంగ్లండ్     డి) పోర్చుగల్
 
 15.    టెన్నిస్‌లో మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌నకు ఇచ్చే కప్‌ను ఏమంటారు?
     ఎ) డేవిస్ కప్     బి) ఫెడ్ కప్
     సి) హాప్‌మన్ కప్     డి) సుధీర్‌మన్ కప్
 
 16.    సెన్‌కాకు దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి?
     ఎ) జపాన్, ఫిలిప్పీన్స్
      బి) జపాన్, చైనా
     సి) చైనా, వియత్నాం
     డి) చైనా, థాయిలాండ్
 
 17.    {పపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) వార్షిక సదస్సు 2014లో ఎక్కడ జరిగింది?
     ఎ) జ్యురిచ్     బి) జెనీవా     సి) దావోస్     డి) బెర్న్
 
 18.    2014 ఫిబ్రవరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి డెరైక్టర్‌గా నియమితులైన తొలి మహిళ ఎవరు?
     ఎ) అర్చనా రామసుందరం     బి) అరుణా బహుగుణ
     సి) సౌమ్యా మిశ్రా     డి) భావనా సక్సేనా
 
 19.    59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఏ చిత్రానికి అత్యధికంగా ఆరు పురస్కారాలు లభించాయి?
     ఎ) ఆషికి-2
     బి) చెన్నై ఎక్స్‌ప్రెస్
     సి) షిప్ ఆఫ్ థీసియస్
     డి) భాగ్ మిల్కా భాగ్
 
 20.    ముంబైకి చెందిన రచయిత సైరస్ మిస్త్రీకి 2014లో ఏ అవార్డు లభించింది?
     ఎ) మూర్తీదేవి అవార్డు     బి) బెయిలీస్ ప్రైజ్
     సి) డీఎస్‌సీ ప్రైజ్     డి) వ్యాస్ సమ్మాన్
 
 21.    ఆసియా ఖండంలో అతిపెద్ద సాహితీ ఉత్సవం ఏటా జనవరిలో ఏ నగరంలో జరుగుతుంది?
     ఎ) జైపూర్         బి) హైదరాబాద్
     సి) కోల్‌కతా     డి) ముంబై
 
 22.    2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చైనా క్రీడాకారిణి లీనా గెలుచుకుంది. ఆమె ఫైనల్‌లో ఎవరిని ఓడించింది?
     ఎ) మారియా షరపోవా    బి) సెరెనా విలియమ్స్
     సి) అనా ఇవనోవిచ్     డి) డొమినికా సిబుల్కోవా
 
 23.    2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
     ఎ) డేవిడ్ ఫై    బి) రోజర్ ఫెదరర్
     సి) స్టానిసా్‌‌లస వావ్రింకా    డి) థామస్ బెర్డిచ్
 
 24.    ఈ సంవత్సరం ఎంతమంది మహిళలకు పద్మ అవార్డులు దక్కాయి?
     ఎ) 20     బి) 24     సి) 27     డి) 29
 
 25.    మహిళల రక్షణ కోసం నిర్భీక్ అనే తేలికపాటి రివాల్వర్‌ను తయారు చేసిన ఇండియన్ ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
     ఎ) కాన్పూర్     బి) లక్నో
     సి) ముంబై         డి) జైపూర్
 
 26.    {పపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
     ఎ) ఫిబ్రవరి 4     బి) మార్చి 4
     సి) జనవరి 4     డి) జూన్ 4
 
 27.    నాస్కామ్ ప్రెసిడెంట్‌గా 2014 జనవరిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
     ఎ) ఎన్.చంద్రశేఖరన్     బి) అజయ్ శ్రీరామ్
     సి) సుబ్రా సురేశ్     డి) ఆర్.చంద్రశేఖర్
 
 28.    వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన కోరె అండర్సన్ 17 ఏళ్ల కిందట ఎవరు నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు?
     ఎ) మార్క్ బౌచర్
     బి) బ్రయాన్ లారా
     సి) షాహిద్ అఫ్రిది
      డి) వివియన్ రిచర్డ్స్
 
 29.    ఇటీవల చైనాలో శాఖను ఏర్పాటు చేసిన భారత్‌కు చెందిన మొదటి ప్రైవేటు బ్యాంకు?
     ఎ) యాక్సిస్ బ్యాంకు    బి) ఐసీఐసీఐ బ్యాంకు
     సి) ఎస్ బ్యాంకు    డి) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
 
 30.    లిటిల్ ఐ ల్యాబ్స్ అనే బెంగళూరుకు చెందిన కంపెనీని కొనుగోలు చేసిన అంతర్జాతీయ కంపెనీ ఏది?
     ఎ) యాహూ    బి) ఫేస్‌బుక్
     సి) ట్విట్టర్         డి) మైక్రోసాఫ్ట్
 
 31.    65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?
     ఎ) మాల్దీవుల అధ్యక్షుడు
     బి) దక్షిణ కొరియా అధ్యక్షురాలు
     సి) థాయిలాండ్ ప్రధానమంత్రి
     డి) జపాన్ ప్రధానమంత్రి
 
 సమాధానాలు:
     1) డి;    2) బి;    3) సి;    4) బి;    5) ఎ;
     6) బి;    7) సి;    8) ఎ;    9) డి;    10) సి;
     11) ఎ;     12) బి;     13) సి;     14) డి;     15) సి;
     16) బి;     17) సి;     18) బి;     19) డి;     20) సి;
     21) ఎ;     22) డి;     23) సి;     24) సి;     25) ఎ;
     26) సి;     27) డి;     28) సి;     29) ఎ;    30) బి;
     31) డి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement