10 ఏళ్ల క్రితం లేని టెక్నాలజీ | Technology that is not 10 years old | Sakshi
Sakshi News home page

10 ఏళ్ల క్రితం లేని టెక్నాలజీ

Published Thu, Jul 27 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

10 ఏళ్ల క్రితం లేని టెక్నాలజీ

10 ఏళ్ల క్రితం లేని టెక్నాలజీ

 పదేళ్లు... ఓ మనిషి జీవిత కాలంలో పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ, అదే పదేళ్ల కాలం టñ క్నాలజీ ప్రపంచంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పదేళ్ల క్రితం ఊహకైనా అందని టెక్నాలజీ ప్రొడక్ట్స్‌ ఎన్నో ఇప్పుడు మనిషి దైనందిన జీవితాన్ని శాసిస్తున్నాయి. పదేళ్ల క్రితం లేని.. అలాంటి టెక్‌ ప్రొడక్ట్స్‌ గురించి తెలుసుకుందాం...

వాట్సాప్‌
జాన్‌ కౌన్, బ్రియన్‌ యాక్షన్‌ మదిలో 2009లో వాట్సాప్‌ ఆలోచన మొగ్గతొడిగింది. తొలుత ఓ మెసేజింగ్‌ యాప్‌ను రూపొందించాలని భావించారు. కానీ అదే వాట్సాప్‌లో ఇప్పుడు మెసేజ్‌లు, కాల్స్‌.. ఒకటేమిటి! వాట్సాప్‌ మనిషి జీవితంలో భాగమైపోయింది. రోజుకో కొత్త ఫీచర్‌తో అలరిస్తోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ 19 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తానికి 2014లో కొనుగోలు చేశారు.

ఆండ్రాయిడ్‌
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 2 బిలియన్ల ఫోన్‌లలో నడుస్తున్న ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను గూగుల్‌ 2007లో రూపొందించింది. మొదటి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ 2008 అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఆండ్రాయిడ్‌తో నడిచే ఫోన్‌ కనిపించడం సర్వసాధారణం. పదేళ్ల క్రితం ఊహకు సైతం అందని ఆండ్రాయిడ్‌ ఫోన్‌.. ఇప్పుడు అత్యంత పవర్‌ఫుల్‌ హైటెక్‌ ప్రొడక్ట్‌!

గూగుల్‌ క్రోమ్‌
గూగుల్‌ తన క్రోమ్‌ బ్రౌజర్‌ను 2008 సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసింది. అప్పుడు ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తన అధికారిక బ్లాగ్‌లో ‘‘మేం చాలా స్ట్రీమ్‌లైన్డ్‌ అండ్‌ సింపుల్‌ బ్రౌజర్‌ విండోను రూపొందించాం’’ అని రాసుకున్నారు. చరిత్రాత్మక గూగుల్‌ హోంపేజీలాగే గూగుల్‌ క్రోమ్‌ కూడా అత్యంత క్లీన్‌ అండ్‌ ఫాస్ట్‌ అని పిచాయ్‌ పేర్కొనడం విశేషం. ఇప్పుడు గూగుల్‌ క్రోమ్‌లేని డివైజ్‌లు తక్కువే అనడం అతిశయోక్తి కాదు.

ఉబెర్‌
ఉబెర్‌ యాప్‌ సాఫ్ట్‌వేర్‌.. కార్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా 2009లో ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 633 సిటీల్లో ఉబెర్‌ సేవలు అందిస్తోంది. ఇది విస్తరిస్తూ పీర్‌ టు పీర్‌ రైడ్‌ షేరింగ్, కార్‌ పూలింగ్, లగ్జరీ రైడ్స్‌ వంటి ఎన్నో సేవల దిశగా విస్తరిస్తోంది. ఫుడ్‌ డెలివరీ మొబైల్‌ యాప్స్‌ను రూపొందిస్తోంది.  

స్పోటిఫై
నేడు మిలియన్ల మంది మ్యూజిక్‌ ప్రియుల ఫోన్‌లలో కనిపిస్తున్న యాప్‌ ఇది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్‌ వంటి హైటెక్‌ డివైజెస్‌లో అందుబాటులో ఉంది. 2008 అక్టోబర్‌లో స్పోటిఫైను లాంచ్‌ చేయగా... 2017 జూన్‌ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 140 మిలియన్ల యాక్టివ్‌ యూజర్స్‌ను కలిగి ఉండటం విశేషం. మ్యూజిక్‌ లవర్స్‌ 30 మిలియన్ల పాటలను ఆర్టిస్ట్, ఆల్బమ్, ప్లేలిస్ట్‌ ఇలా..వివిధ కేటగిరీల్లో సెర్చ్‌ చేసుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా కనెక్టివిటీ ఫీచర్‌ ఉన్న స్పాటిఫై యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడమే.

ఐ పాడ్‌
మొదటి ఐపాడ్‌ను టెక్నాలజీ లెజెండ్‌ స్టీవ్‌ జాబ్స్‌ 2010లో లాంచ్‌ చేశారు. ఇది టాబ్లెట్‌ కంప్యూటర్‌. యాపిల్‌ కంపెనీ ఇప్పటికే అనేక మోడల్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఐ పాడ్‌ ప్రోను 2017, జూన్‌ 13న లాంచ్‌ చేసింది. మల్టీటచ్‌ స్క్రీన్, వర్చువల్‌ కీబోర్డ్, వైఫై కనెక్షన్‌ తదితర ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఇప్పటికే మిలియన్‌ల మంది చేతిలో ఉంది ఈ ఐపాడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement