గులాబీ దళపతి వలస నేతలను నమ్ముకున్నట్టున్నారు. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లతో స్వాగతిస్తున్నారు. దీనితో స్వపక్షంలో విపక్షం తలెత్తి అసమ్మతి రాగాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీన్ని కేసీఆర్ హామీల మంత్రంతో సర్దుబాటు చేస్తున్నా పార్టీని నమ్ముకున్న కేడరులో అసంతృప్తి రగులుతోంది. అయితే అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు శంఖారావం చేశారు. ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉత్కంఠకు తెర వేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌స భ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌లో టికెట్ దక్కక పోవడంతో టీఆర్‌ఎస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి కొడంగల్ టికెట్ కేటాయించారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి నెల రోజుల క్రితం పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి పేరుకు తుది జాబితాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చా రు. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాల అ భ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండో జాబితాలో షాద్‌నగర్ నుంచి అంజయ్య యాదవ్ పేరును ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ మంద జగన్నాథంకు అవకాశం లభించింది.
నారాయణపేట నియోజకవర్గంపై టీడీపీ, బీజేపీ, కొ డంగల్‌లో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాల తో టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపికను వా యిదా వేసింది. కొడంగల్‌లో టికెట్ దక్కని గుర్నాథ్‌రె డ్డి సోమవారం రాత్రి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కొడంగల్ నుంచి పున్నం చంద్ లా హోటీ టీఆర్‌ఎస్ టికెట్ ఆశించినా గుర్నాథ్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు.
నారాయణపేట నుంచి టీ ఆర్‌ఎస్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన శివకుమార్ రెడ్డి పేరు తొలి రెండు జాబితాల్లో లేకపోవడంతో ఉత్కం ఠతో ఎదురు చూశారు. టీడీపీ, బీజేపీ నడుమ పొత్తుల పంచాయతీ తేలకపోవడంతో టీఆర్‌ఎస్ టికెట్ శివకుమార్‌రెడ్డికి దక్కడం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాపై స్పష్టత రావడంతో నారాయణపేట అభ్యర్థిని కూ డా ఖరారు చేసి జిల్లాలో టికెట్ల ఎం పిక కసరత్తును పూర్తి చేశారు.
ఉన్నవారికి ఒత్తిచేయి
టీఆర్‌ఎస్ ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకే పెద్దపీట వేసినట్లు జాబితా వెల్లడిస్తోంది. చివరి నిముషంలో పార్టీలో చేరిన నేతలకు కూడా టికెట్లు దక్కడంతో ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు దిక్కులేకుండా పోయింది. జడ్చర్ల, అచ్చంపేట, షాద్‌నగర్, కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే గతంలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు.
ఎంపీ అభ్యర్థులు జితేందర్‌రెడ్డి (బీజేపీ, టీడీపీ), మంద జగన్నాథం (టీడీపీ, కాంగ్రెస్) నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. శివకుమార్ రెడ్డి (కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ), గుర్నాథ్‌రెడ్డి (కాంగ్రెస్), వై.ఎల్లారెడ్డి (టీడీపీ), జైపాల్ యాదవ్ (టీడీపీ), మర్రి జనార్దన్ రెడ్డి (టీడీపీ), జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), కృష్ణమోహన్ రెడ్డి (టీడీపీ, వైఎస్సార్‌సీపీ), ఆల వెంకటేశ్వర్ రెడ్డి (టీడీపీ) నేపథ్యం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆలంపూర్ నుంచి పోటీ చేస్తున్న మంద శ్రీనాథ్ నాగర్‌కర్నూలు ఎంపీ మంద జగన్నాథ్ కుమారుడు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీజీఓ నేత వి.శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం లభించింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఇబ్రహీం ఇప్పటికే పార్టీని వీడగా టికెట్ దక్కని గట్టు భీముడిని ఎమ్మెల్సీ హామీతో కేసీఆర్ చల్లబరిచారు. కల్వకుర్తి టికెట్ ఆశించిన బాలాజీ సింగ్ అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.
వారికే పెద్దపీట
Published Wed, Apr 9 2014 3:50 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement