ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల యంత్రాంగం అందించిన సమాచారం ప్రకారం....బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో మొత్తం 80 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 82 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... జిల్లాలో అత్యధికంగా పాలేరు, మధిర నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదైంది.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ 89 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఇక, జిల్లాలో అత్యల్పంగా ఇల్లెందు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కేవలం 72 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సత్తుపల్లిలో 85 శాతం, వైరాలో 81.2, పినపాకలో 80, అశ్వారావుపేటలో 85.52, భద్రాచలంలో 73, కొత్తగూడెంలో 72.61శాతం పోలింగ్ నమోదైంది.