తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి: కేసీఆర్
హైదరాబాద్: కిరాయి పాలనా.. సొంత పాలనా?.. ఏదీ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని టీఆర్‌ఎస్ చీఫ్ చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణకు పట్టిన శనిగా అభివర్ణించారు. ఉద్యమం నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌కే సీఎం పోస్టును అడిగే అర్హత ఉందని కాంగ్రెస్‌కు చురకలంటించారు. అసెంబ్లీకి 69 మంది అభ్యర్థులతో కూడిన పార్టీ తొలి జాబితాను శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పరాయి పాలనలో నలిగారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొందరు రంగులు మార్చి ప్రజలను ఏమార్చడానికి వస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘తెలంగాణను కబళించడానికి వచ్చిన చంద్రబాబు ఉద్యమ ద్రోహి. ఆయన చివరి వరకు తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పరాయి పాలనలో ఉంది. మళ్లీ ఇప్పుడు కొంత మంది కిరాయి మనుషులు వస్తున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కిరాయి పాలన కావాలో, సొంత పాలన కావాలో తే ల్చుకోవాల్సిన సమయం వచ్చింది’ అని కేసీఆర్ అన్నారు. తొలి జాబితాలో వుుస్లిం అభ్యర్థులకు ఎక్కువగా అవకాశం ఇవ్వకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ.. గతంలో రెండు సార్లు వుహబూబ్‌నగర్‌లో టిక్కెట్ ఇస్తే ఓడించారని, బోధన్‌లో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. అందుకు వుుస్లింలే కారణవూ? అన్న ప్రశ్నకు... ఆయున కాదా? అని ఎదురు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఖరారైన ఎంపీ
అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.
ఎక్కడ.. ఎవరు?: మెదక్ - కె.చంద్రశేఖర్‌రావు, జహీరాబాద్ - బి.బి.పాటిల్, నిజామాబాద్ - కె.కవిత, మహబూబ్‌నగర్ - ఎ.పి.జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు - మందా జగన్నాథం, కరీంనగర్ - బి.వినోద్‌కుమార్, వరంగల్- కడియం శ్రీహరి, మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాం నాయక్, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్, నల్లగొండ - రాజేశ్వర్ రెడ్డి, చేవెళ్ల - కె.విశ్వేశ్వర్ రెడ్డి
కిరాయి పాలనా.. సొంత పాలనా?
Published Sat, Apr 5 2014 1:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement