బీజేపీ ‘భీష్ముడు’ | BJP party legend LK advani may not contest in elections | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘భీష్ముడు’

Published Sat, Mar 29 2014 1:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

బీజేపీ ‘భీష్ముడు’ - Sakshi

బీజేపీ ‘భీష్ముడు’

బిగ్ ఫిగర్:  మోడీ బోనులో వృద్ధ సింహం... అద్వానీ
నాంచారయ్య మెరుగుమాల: ‘‘అద్వానీజీ గాంధీనగర్‌లో బందీగా ఉన్నారు. అక్కడి నుంచి బయుట పడాలనుకుంటున్నా వీలు కాని నిస్సహాయ స్థితిలో ఉన్నారు’’ - బీహార్ వుుఖ్యవుంత్రి నితీశ్‌కువూర్ ఐదు రోజుల క్రితం పాట్నాలో అన్న ఈ వూటలు బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నారుు. పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేసిన మూల స్తంభాల్లో ముఖ్యుడిగా కొన్నేళ్ల క్రితం దాకా అద్వానీ ప్రభ వెలిగిపోయింది. కానీ ఇప్పుడు...? ‘అద్వానీ ఈసారి లోక్‌సభకు ఏ సీటు నుంచి పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా?’ అంటూ ఇంటా బయటా సవాలక్షసందేహాలు! 48 గంటల సంక్షోభం తర్వాత వాటికి సమాధానాలు సుస్పష్టంగా ఇచ్చిన సందేశం ఒక్కటే... బీజేపీలో అద్వానీది ఇక ముగిసిన శకమే! ఆ పరిణామాల క్రమాన్ని గమనిస్తే ఇది చక్కగా అర్థమవుతుంది. సిట్టింగ్ స్థానమైన గుజరాత్‌లోని గాంధీనగర్‌ను వదిలి వుధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి పోటీ చేయాలన్న ‘భీష్మ పితావుహుడి’ ఆకాంక్షను మన్నించేందుకు బీజేపీ నాయకత్వం తొలుత ససేమిరా అంది.
 
  రెండ్రోజులు సస్పెన్స్‌లో పెట్టి, చివరకు ‘ఎక్కడి నుంచి పోటీ చేయూలో మీరే తేల్చుకోండి’ అంటూ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించడంతో చివరికి అంతా సద్దుమణిగినట్టే కన్పించింది. కానీ, ‘సంఘ్ పరివార్ పెద్ద ఆరెసెస్ వూటను వున్నించి, పార్టీని ఇబ్బంది పెట్టకుండా గాంధీనగర్ నుంచే వుళ్లీ నిలబడేందుకు’ అద్వానీ ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా ఆయన తాజా, బహుశా చిట్టచివరి తిరుగుబాటు కూడా చరిత్రలో కలిసిపోరుుంది. పైగా ప్రధాని కావాలన్న అద్వానీ దీర్ఘకాలిక ఆకాంక్షలకు శిష్యుడైన నరేంద్ర మోడీయే శాశ్వతంగా గండి కొట్టారు. తన రాజకీయ జీవితపు మలి సంధ్యలో ఇలాంటి రోజులను చవిచూడాల్సి వస్తుందని ఈ 86 ఏళ్ల వృద్ధ నేత బహుశా ఊహించి ఉండరు.
 
 బీజేపీ అంటే అద్వానీయే...
 బీజేపీ రూపంలో అవతరించిన కాషాయు పార్టీ 1984 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన రెండు సీట్లను ఐదేళ్ల తర్వాత 86కు, 1990 సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో సాగించిన రథయూత్రతో 1991లో 120 వరకూ పెంచడంలో అద్వానీది కీలక పాత్ర. 1996 ఎన్నికల్లో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెల్చుకోవడం ద్వారా తొలిసారి కేంద్రంలో బీజేపీకి అవకాశం రావడం వెనుక  కూడా అద్వానీ శ్రవు ఉంది. 1999 ఎన్నికల్లో వురోసారి బీజేపీ 183 సీట్లు గెలుచుకుని, 23 పార్టీల భాగస్వావ్యుంలో ఏర్పాటు చేసిన సంకీర్ణం దాదాపు నాలుగున్నరేళ్లకు పైగా నడవడంలో కూడా ఆయన చాకచక్యమే ప్రధాన భూమిక పోషించింది.
 
 ఇంత చేసిన అద్వానీకి ఈసారి తాను ఎంచుకున్న స్థానం నుంచి పోటీ చేసే స్వేచ్ఛను కూడా నాయకత్వం ఎందుకివ్వనట్టు? గతంలో పలుమార్లు బీజేపీ నాయుకత్వం ఇచ్చిన సంకేతాల్లోనే ఈ ప్రశ్నకు సవూధానం కనిపిస్తుంది. పదేళ్లపాటు బీజేపీ అధికారంలో లేకపోవడం, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ గెలవలేవునే భయూందోళనలు బీజేపీని వెనుక నుంచి నడిపించే ఆరెసెస్ నాయుకత్వాన్ని పీడించడం అద్వానీ ప్రస్తుత దయునీయు స్థితికి కారణాలని చెప్పవచ్చు. 2012 డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వుుఖ్యవుంత్రి నరేంద్ర మోడీ నాయుకత్వంలో వుూడోసారి వుంచి మెజారిటీతో గెలిచే వరకూ కేంద్రంలో వుళ్లీ గద్దెనెక్కుతావునే నవ్ముకం బీజేపీలో కలగలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కనీసం అతి పెద్ద పార్టీగానైనా అవతరించే అవకాశం బీజేపీకి వస్తుందనే ఆశ ఆ పార్టీ నేతల్లో కూడా అప్పటిదాకా కనిపించలేదు.
 
  కానీ గుజరాత్ విజయుంతో కాషాయుపక్షం అంచనాలు ఒక్కసారిగా వూరిపోయూరుు. అప్పటిదాకా 2002 నాటి గోధ్రా ఘటన తదనంతర వుుస్లింల ఊచకోతకు కారకుడిగా పేరుపడిన 62 ఏళ్ల మోడీ ఇమేజ్  ‘వికాస్ పురుష్’ అనే స్థారుులో కొత్త రూపు దిద్దుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని విజయుపథంలో నడిపించే నేతగా మోడీకి పార్టీలో, దేశంలో గుర్తింపు తొలిసారి లభించింది. జీవిత చరవూంకంలోనైనా ప్రధాని కావాలనే అద్వానీ ఆకాంక్షకు ఇదే అడ్డంకిగా వూరింది. ఆయున ఆరున్నర దశాబ్దాల రాజకీయు జీవితం గౌరవప్రదంగా వుుగియుడానికి వీలులేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసింది. 2012 డిసెంబర్ 20న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వుర్నాడే విజయుగర్వంతో ఢిల్లీ వెళ్లి విలేకరుల సవూవేశంలో ప్రసంగించిన మోడీ - జాతీయుస్థారుులో పార్టీ అప్పగించే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధమేనని ప్రకటించడంతో ప్రధాని అభ్యర్థిత్వం అందుకునే రేసులో వుుందుకొస్తున్నారనే విషయుం అందరికీ అర్థమైంది. అద్వానీ మినహా... ఆరెసెస్ అగ్రనాయుకత్వం, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సహా అగ్ర నేతలంతా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడమే మేలనే అభిప్రాయూనికి వచ్చారు. తొలి అడుగుగా కిందటేడాది జూన్‌లో గోవాలో జరిగిన బీజేపీ జాతీయు కార్యవర్గ సవూవేశంలో మోడీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా ప్రకటించారు. దాంతో అద్వానీకి తన భవిష్యత్ చిత్రం అప్పుడే కళ్ల వుుందు కనిపించింది.
 
 పార్టీలో అన్ని పదవులకూ రాజీనావూ ప్రకటించి నిరసన వెలిబుచ్చినా, ఆరెసెస్ జోక్యంతో చివరికి ఆయనే దారికొచ్చి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అంతేగాక మోడీ ప్రమోషన్‌ను అరుుష్టంగానే అయినా అంగీకరించక తప్పలేదు. 2013 డిసెంబర్‌లో జరిగిన నాలుగు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ఎన్నికల సర్వేలు చెప్పడంతో ఆ పార్టీ నాయకత్వం ఇక ఆగలేకపోయింది. కనీసం ఆ ఫలితాలు వెల్లడయ్యేదాకా ప్రధాని అభ్యర్థి ప్రకటనను వారుుదా వేయూలన్న అద్వానీ ప్రతిపాదనను తోసిపుచ్చి మరీ సెప్టెంబర్‌లోనే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేసింది. బీజేపీలో అద్వానీ ఇక చెల్లని నాణెవునే విషయుం అక్కడితో స్పష్టమైంది.
 
 తొమ్మిదేళ్ల క్రితమే అద్వానీపై ఆరెసెస్ కన్నెర్ర
 2005లో పాకిస్థాన్‌లోని తన జన్మస్థానమైన కరాచీకి వెళ్లి, పాక్ నేత వుహ్మదలీ జిన్నా గొప్ప లౌకికవాది అని ఆ గడ్డ నుంచే కీర్తించి బీజేపీలో అప్రతిష్టపాలయ్యూరు అద్వానీ. అంతేగాక ఆరెసెస్ ఆగ్రహానికి కూడా గురై పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయూరు. సంఘ్ పెత ్తనాన్ని తొలుత తీవ్రంగా ప్రతిఘటించి చివరకు తలవంచారు.
 
 వురో జనాకర్షణగల నేత లేని పరిస్థితుల్లో 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీని అంగీకరించింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయూవకాశాలు లేవని అప్పటికే తేలిపోయింది. ఆరెసెస్ కూడా బీజేపీకి మద్దతుగా తన కేడర్‌ను రంగంలోకి దింపకుండా నిరాసక్తంగా ఉండిపోయింది. ఇప్పటి పాకిస్థాన్‌లోని ప్రాంతాల్లో పుట్టి భారత ప్రధాని పదవి చేపట్టిన గుల్జారీలాల్ నందా, ఐకే గుజ్రాల్, వున్మోహన్‌సింగ్‌ల జాబితాలో చేరాలన్న అద్వానీ ఆకాంక్ష నెరవేరేది కాదని ఇటీవలి పరిణావూలతో తేటతెల్లమైనట్టే.
 
 మల్కాజిగిరిలో ఓటర్ల సంఖ్య ఇది దేశంలో ఇదే అతిపెద్ద ఎంపీ స్థానం
 29,53,915 కేఎస్సార్
 దేశంలోకెల్లా అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రాష్ట్రంలోని మల్కాజిగిరి రికార్డుల్లోకెక్కింది. దేశవ్యాప్తంగా ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో సగటున 15 లక్షల ఓటర్లుంటే మల్కాజిగిరిలో మాత్రం ఏకంగా అందుకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు! కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన గణాంకాల మేరకు మల్కాజిగిరి ఓటర్ల సంఖ్య 29,53,915! తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ (22,63,961), కర్ణాటకలోని బెంగళూరు నార్త్ (22,29,063), యూపీలోని ఉన్నావ్ (21,10,388), ఢిల్లీ నార్త్ వెస్ట్ (20,93,922) నిలిచాయి.
 
 ఇక కేవలం 47,972 మంది ఓటర్లతో లక్షద్వీప్ దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానంగా ఉంది. అంటే అసెంబ్లీ నియోజకవర్గం ఓట్లలో నాలుగో వంతు! లక్షద్వీప్ తర్వాతి స్థానాల్లో డామన్-డయ్యూ (1,02,260), జమ్మూ కాశ్మీర్‌లోని లడక్ (1,59,949), దాద్రానగర్ హవేలీ (1,88,783), అండమాన్ నికోబార్ (2,57,856) ఉన్నాయి. ఈ ఐదు లోక్‌సభ స్థానాల్లోని మొత్తం ఓటర్లను కలిపినా మన రాష్ట్రంలోని ఒక ఎంపీ స్థానం ఓటర్లలో సగమే ఉంటారు!
 
 తాతయ్య ‘ఓటు’ పిలుపు...
 హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శ్యామ్‌శరణ్ నేగీ (97) ఓటు వేయాలంటూ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ‘ఆన్‌లైన్’లో అందరినీ దృష్టినీ ఆకట్టుకుంటోంది. దేశంలోని అత్యంత వృద్ధ ఓటర్లలో ఒకరైన నేగీ, 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ‘ప్లెడ్జ్ టు వోట్’ పేరిట నేగీపై గూగుల్ రూపొందించిన 2.34 నిమిషాల నిడివి గల మ్యూజికల్ వీడియోను బాలీవుడ్ మెగాస్టార్లు అమితాబ్ బచ్చన్, దియా మీర్జా తదితరులు నటించిన వీడియో కంటే పదిరెట్లు ఎక్కువ మంది చూశారంటే, తాతయ్య ‘ఓటు’ పిలుపు ఎంతగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను మార్చి 24న ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, ఇప్పటి వరకు దాదాపు 35 వేల మంది చూశారు. ఓటు హక్కు ఉపయోగించుకోవాలంటూ అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్,  దియా మీర్జా, అర్జున్ రామ్‌పాల్, రైమా సేన్ తదితరులతో రూపొందించిన వీడియోను మాత్రం ఇంతవరకు దాదాపు మూడువేల మంది మాత్రమే చూశారు. హిమాలయాల దిగువన కల్పా గ్రామంలో నివసించే నేగీ, ఉపాధ్యాయుడిగా పనిచేసి, 1975లో రిటైరయ్యారు.
 
 చాయ్ పే ఓట్
 నరేంద్రమోడీ పుణ్యమాని ఈ ఎన్నికల సీజన్‌లో టీ స్టాళ్ల పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. చాయ్ పే చర్చా అంటూ చాయ్ బండ్ల దగ్గర రచ్చబండ కార్యక్రమాలు పెట్టడంతో టీ కి గిరాకీ బాగా పెరిగింది. టీ స్టాళ్ల ప్రాముఖ్యతను గుర్తించిన ఒడిశాలోని నేతాలోగ్ కూడా ఉదయం లేవగానే ముందు చాయ్ బండి దగ్గరికి పరిగెత్తుతున్నారు. అక్కడే మాటామంతీ మాట్లాడుతూ.. పనిలో పనిగా ‘ఈ సారి మీ ఓటు మాకే’ అంటూ ఎన్నికల ప్రచారం కూడా కానిచ్చేస్తున్నరు. పొద్దున్నే అయితే, అంతా ప్రశాంతంగా ఉంటరు. తిక్కతిక్క ప్రశ్నలేయరు. మా పని ఈజీగా అయిపోతుంది అంటున్నారు. అలాగే ఓ పనైపోద్దనుకుంటూ మార్నింగ్ వాకర్స్‌ను, యోగా సాధకులను కూడా కలిసి ఓటడిగేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement